అక్టోబర్ 2న మాంసం దుకాణాలు, వైన్స్ బంద్ ..
హైదరాబాద్, వార్త నేత్రం ప్రతినిధి:
మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 2న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాంసం దుకాణాలు, వధశాలలు మూసివేయాలని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు ఆదేశాలు జారీ చేసింది . అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతిగా సంధర్బంగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక సెలవు ప్రకటించింది. గొర్రెలు, మేకలు, ఇతర పశువుల వధశాలలతో పాటు మాంసం విక్రయించే దుకాణాలను కూడా ఆ రోజు నిర్వహించరాదని అధికారులు సూచించారు . GHMC స్టాండింగ్ కమిటీ తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు . నిబంధనలు అమలయ్యేలా మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేపట్టనున్నారు.ఇదిలా ఉండగా, గాంధీ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలపై కూడా డ్రై డే నిబంధనలు అమల్లో ఉంటాయి. తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నిబంధనల్లో డ్రై డే సమయంలో మద్యం విక్రయిస్తే చర్యలు, జరిమానాలకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి.అక్టోబర్ 2న వైన్స్, మద్యం విక్రయ కేంద్రాలు మూసివేయాల్సి ఉండటంతో వినియోగదారులు ముందుగానే తమ అవసరాలను గమనించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయాలు నిర్వహించినా, మాంసం దుకాణాలు తెరిచినా సంబంధిత చట్టాలు, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.గాంధీ జయంతి సందర్భంగా శాంతియుత వాతావరణం కొనసాగించడంతో పాటు ప్రభుత్వ ఆదేశాలను వ్యాపారులు, ప్రజలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.

Comments
Post a Comment