Posts

Showing posts from December, 2019

చట్టాల సవరణకు సిద్దం... అమిత్ షా...

Image
  దిల్లి:  త్యాచారం వంటి తీవ్ర నేరాల్లో న్యాయం ఆలస్యం అవుతుండడంతో ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను సవరించాలని ప్రభుత్వం సంకల్పించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలిపారు. ఈ విషయమై చట్టంలో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందని సలహాలు కోరుతూ రాష్ట్రాలకు లేఖ రాసిన తర్వాత రోజే అమిత్‌షా ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. పుణెలో నిర్వహించిన 54వ డీజీపీ, ఐజీపీల సదస్సుకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత ప్రజాస్వామ్యానికి అనుకూలంగా హత్యాచారం వంటి తీవ్రమైన నేరాల్లో శిక్ష ఆలస్యం కాకుండా ఉండేలా చట్టాల్లో సవరణలు చేయాల్సిన విషయాన్ని అమిత్‌షా నొక్కిచెప్పారు. ప్రతి రాష్ట్రంలో అనుబంధ కళాశాలలతో ఆల్‌ ఇండియా పోలీస్‌ యూనివర్శిటీ, ఆల్‌ ఇండియా ఫోరెన్సిక్‌ సైన్స్‌ యూనివర్శిటీ ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు చెప్పారు. అందరూ పోలీసులు ఒక తాటిపైకి వచ్చి జాతీయ భద్రతకు తీసుకోవాల్సిన నిర్ణయాలను తెలియజేయాలని కోరారు. డీజీపీ, ఐజీపీల సదస్సు చివరి రోజైన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ డోభాల్‌, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ భల్లా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు....

ఫారెస్ట్ కాలేజీని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

Image
  సిద్దిపేట   :ములుగులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఫారెస్ట్ కాలేజీ  అండ్ రీసెర్చ్ సెంటర్ (FCRI)ను సీఎం  కేసీఆర్ సోమవారం ప్రారంభించనున్నారు. రూ.75 కోట్ల వ్యయంతో ఈ సెంటర్‌ను నిర్మించారు. ఉద్యానవనాల అభివృద్ధి, పరిశోధన కోసం ములుగులో ఏర్పాటుచేసిన తెలంగాణ ఉద్యాన వర్సిటీని కూడా సీఎం ప్రారంభించనున్నారు.ఇప్పటి వరకూ దూలపల్లిలో నిర్వహిస్తున్న ఫారెస్ట్ కాలేజీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌ను ఇక నుంచి ములుగులో నిర్వహిస్తారు.దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ క్యాంపస్‌లో 2016లో బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటికే మూడు బ్యాచులు పూర్తయ్యాయి. ఎఫ్‌సీఆర్ఐలో వచ్చే ఏడాది నుంచి ఎమ్మెస్సీ, 2022 నుంచి పీహెచ్‌డీ ఫారెస్ట్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇటీవలే అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో.. అమెరికాకు చెందిన ఆబర్న్ యూనివర్సిటీ, ఎఫ్‌సీఆర్‌ఐ మధ్య ఎంవోయూ కుదిరింది. విద్యాసంబంధ విషయాలపై పరస్పర అవగాహన ఒప్పందాన్ని (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. తమిళనాడు స్ఫూర్తితో.. తమిళనాడు ప్రభుత్వం మెట్టుపాళ్యంలో చాలా ఏళ్ల క్రితమే ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌‌ను ఏర్పాటు ...

ఈ విషయం మీకు తెలుసా ?

ప్రమాదంలో...ఆర్థిక భరోసా మూడేళ్లు ఐటీ రిటన్స్ దాఖలు చేస్తే పదిరెట్ల పరిహారం. ఆదిలాబాద్: మూడేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలుచేసిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి ఆదాయాన్ని బట్టి పది రెట్లు పరిహారం పొందే అవకాశం ఉందని ఆంగకులోని మిట్స్  ఇంజినీరింగ్ కళాశాల అడ్మిని స్టేటివ్ ఆఫీసర్ వాహన చటం,అవగాహన దారు ఎంహెచ్ దాదాపీరి,తెలిపారు  ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ ఆర్థిక భరోసా విషయం చాలామందికి తెలియక నష్టపోతున్నారని పేర్కొన్నారు .ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మూడేళ్ల పాటు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసి ఉండాలన్నారు ఆ వ్యక్తి ప్రమాదవ శాత్తు మరణిస్తే అతని వార్షిక ఆదాయాన్ని బట్టి పదిరెట్లు పరిహారం ఆదాయాన్ని ఇవ్వాలని మోటారు వాహన చటం చెబుతోందన్నారు ఒక వ్యక్తి వార్షిక ఆదాయం ..రూ.5 లక్షలు ఉంటే అతను ప్రమాదవశాతు మరణిసే వారి కుటుంబానికి పదిరెట్లు అంటే రూ.50 లక్షలు పరిహారం లభిస్తుందన్నారు.ప్రమాదం జరిగిన ఆరు నెలల్లోపు కైం చేసుకోవాలన్నారు దీనిపై ప్రజలకు అవ గాహన కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భద్రత ఉల్లంఘనపై స్పందించిన వాద్రా

Image
భద్రత ఉల్లంఘనపై స్పందించిన వాద్రా దిల్లీ: కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ నివాసం వద్ద భద్రతా ఉల్లంఘనపై ఆమె భర్త రాబర్ట్‌ వాద్రా స్పందించారు. దేశవ్యాప్తంగా పౌరులకు భద్రత కరవైందని వ్యాఖ్యానించారు. దేశంలోని ప్రతి వ్యక్తి భద్రత ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ''ప్రియాంక, నా కుమార్తె, నా కొడుకు లేదా గాంధీ కుటుంబ భద్రత అన్నది ఇక్కడ విషయం కాదు. మన పౌరులకు ముఖ్యంగా మన మహిళలకు భద్రత కల్పించి.. వారు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాలికలపై తరచూ దాడులు జరుగుతున్నాయి. మనం ఎలాంటి సమాజాన్ని తయారుచేస్తున్నాం? దేశంలోని ప్రతి పౌరుడి భద్రత ప్రభుత్వ బాధ్యత. మన దేశంలో, ఇంట్లో, బయటా భద్రత లేదు. పగలు, రాత్రి సురక్షితంగా ఉండలేని పరిస్థితి. ఇక మనకు ఎప్పుడు, ఎక్కడ భద్రత ఉంటుంది?'' అని వాద్రా ఫేస్‌బుక్‌ వేదికగా ప్రశ్నించారు. గుర్తుతెలియని ఏడుగురు వ్యక్తులు గతవారం ఒక కారులో ప్రియాంక ఇంటి ప్రాంగణంలోని ద్వార మంటపం వరకూ వెళ్లారు. అంతేకాకుండా కిందకి దిగి, నేరుగా ప్రియాంక వద్దకు వెళ్లి, తమతో ఫొటో దిగాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చొరబాటుదారుల్లో ముగ్గురు చొప్పున పురుషుల...