పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు!
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి అమరావతి:జనవరి 07 ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా పోలవరంలో బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు పర్యటించారు.ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు పురోగతి పనులపై ఆయన విజిట్ చేశారు. 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలనే పట్టుదల తో ఉన్న ప్రభుత్వం, నిర్మాణ దశలను నిశితంగా పర్యవేక్షిస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే ద్వారా ప్రాజెక్టు ప్రస్తుత స్థితిని వీక్షించారు. అనంతరం నేరుగా నిర్మాణ ప్రాంతానికి చేరుకుని కాఫర్ డ్యామ్, బట్రస్ డ్యామ్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఈసీఆర్ఎఫ్ గ్యాప్-1, గ్యాప్-2 పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో జరుగుతున్న తాజా పరిణామాలపై సమీక్షించారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని ఇంజనీర్లను, కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్వాసితుల పునరావాస ప్యాకేజీల ఆర్ అండ్ ఆర్, అమలుప...