రేపు తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం!
వార్త నేత్రం : ప్రతినిధి
హైదరాబాద్:డిసెంబర్ 10
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండగా.. తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 11, గురువారం నాడు జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలి విడత ప్రచారానికి గడువు మంగళవారం సాయంత్రంతో ముగిసింది. గురువారం జరగబోయే పోలింగ్ కోసం ఇప్పటికే మండల కేంద్రాలకు బ్యాలెట్ పేపర్లు, బాక్సులు పంపించారు. బుధవారం వీటిని గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు తరలించనున్నా రు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నిక లను పర్యవేక్షించనున్నారు.
మూడు విడతల్లో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల కోసం మొత్తం 10 వేలకు పైగా కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. తొలి విడతలో 3 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించాలి.
ఎన్నికల పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ మొదలు పెట్టాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. ముందు సర్పంచ్, వార్డు మెంబర్లను ప్రకటించాలి. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియ చేపట్టాలన్నారు. అయితే ఈసారి గ్రీన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది.
ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రేవంత్ సర్కార్.. రూ.175 కోట్లు కేటాయించింది. దీనిలో ఇప్పటి వరకు రూ.100 కోట్ల మేర నిధులు మంజూరు అయ్యాయి. ఈ మొత్తాన్ని ఇప్పటికే జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఆఫీసర్ల ఖాతాల్లో జమ చేశారు. అలానే పోలింగ్ కేంద్రాల వారీగా ఎంపీడీవోల ఖాతాల్లో కూడా నిధులు జమ అయ్యాయి.
మిగిలిన రూ.75 కోట్లను కూడా ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఈ నిధులు సరిపోవని.. మరో 50 కోట్ల వరకు అవసరం ఉంటుందని.. పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని తెలుస్తోంది.
మొదటి విడతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 149 చోట్ల నామినేషన్లు వేయలేదు. వార్డుల్లోనూ రికార్డు స్థాయిలో 9,331 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27,960 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుంది. వార్డులకు 67,893 మంది బరిలో ఉండడం గమనార్హం.
Comments
Post a Comment