ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులపై కేంద్రం చర్యలు..

 



న్యూఢిల్లీ, వార్త నేత్రం ప్రతినిధి: 

ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)లోని డేటాబేస్‌ను ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు హిందుస్థాన్ టైమ్స్ నివేదించింది. గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు పొందని సుమారు 15.8 మిలియన్ (1.58 కోట్లు) లబ్ధిదారుల రేషన్ కార్డులపై అక్టోబర్ నుంచి తాత్కాలికంగా రేషన్ హక్కులను నిలిపివేయనున్నట్లు తెలిపింది. అయితే కార్డులను వెంటనే డేటాబేస్ నుంచి పూర్తిగా తొలగించకుండా, ముందుగా తాత్కాలికంగా డిసేబుల్ చేసి అర్హతను నిరూపించుకునేందుకు మూడు నెలల అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. కేంద్రం ఈ చర్యను ‘సైలెంట్ రేషన్ కార్డులు’గా పిలుస్తున్న, గత ఆరు నెలల్లో రేషన్ కోటాను వినియోగించని కార్డుల పరిశీలనలో భాగంగా చేపడుతోంది. మూడు నెలల వ్యవధిలో లబ్ధిదారులు e-KYC పూర్తి చేసి తమ అర్హతను నిర్ధారించుకుంటే కార్డులను తిరిగి యాక్టివ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అవసరమైన చోట ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే విధానం అమలు చేయనున్నట్లు నివేదిక పేర్కొంది. డూప్లికేట్ కార్డులు, మరణించిన వ్యక్తుల పేర్లు, వలస వెళ్లిన వారు లేదా అర్హత లేని లబ్ధిదారులను గుర్తించి పీడీఎస్‌లో లీకేజీలను తగ్గించేందుకు డేటాబేస్ ప్రక్షాళన అవసరమని ప్రభుత్వం పేర్కొంటోంది. గతంలోనూ డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, e-KYC వంటి ప్రక్రియల ద్వారా రేషన్ కార్డుల డేటాను శుద్ధి చేసినట్లు కేంద్రం తెలిపింది. అయితే లబ్ధిదారుల పరిస్థితులను పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


Comments

Popular posts from this blog

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!

తియ్యని విషం ..!

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...