తెలంగాణ అసెంబ్లీలో వృద్ధ తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా బిల్లు!




వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:మార్చి 28

తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది, శనివారం శాసన సభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీ తనం పర్యవేక్షణ బిల్లు 2026 ను ప్రవేశపెట్టనుంది...

దీంతోపాటు..తెలంగాణ ప్రభుత్వం. సింగరేణి 103, 104వ వార్షిక రిపోర్ట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టను న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ తర్వాత.. తెలంగాణ పంచాయతీ రాజ్‌-2026 అమెండ్మెంట్‌ బిల్లును మంత్రి సీతక్క సభలో ప్రవేశపెడతారు. వృద్ధ దంపతులకు ఆర్థిక భరోసా బిల్‌ను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. 2026-27 బడ్జెట్‌ గ్రాంట్స్‌, ట్రాన్స్‌పోర్ట్‌ అడ్మినిస్ట్రేషన్‌.

వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇక.. గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, స్త్రీ శిశు సంక్షేమశాఖకు పద్దుల కేటాయింపుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానం ఇస్తారు. 

ఇదిలా ఉంటే.. ఇవాళ, రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం మృతి!