ఏపీకి దిత్యాహ్ తుఫాన్ గండం?
వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి
అమరావతి'డిసెంబర్ 01
ఏపీలో ప్రభావం చూపిస్తున్న దిత్వాహ్ తుపాన్ క్రమంగా బలహీనపడుతుంది. తమిళనాడు పుదుచ్చేరి తీరం వెంబడి ఉత్తరం వైపు కదులుతూ భయపెట్టిన సైక్లోన్.. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈరోజు అది మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.
ఈ క్రమంలో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో దిత్వాహ్ తుపాను ఉత్తర వాయువ్య దిశగా కదిలి తీవ్ర వాయు గుండంగా బలహీనపడిం దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
సోమవారం ఉదయం వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. సోమవారం దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అన్నారు.
శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం దిత్వా తుపాను నెమ్మదిగా కదులుతోంది. గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం దిశగా వస్తూ ఉంది. సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ సమయంలో ఏపీలోని తిరుపతికి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత అక్కడ వంకరగా తిరిగి.. యూటర్న్ తీసుకుంటుంది.
ఇదిలాఉంటే.. తుపాను తమిళనాడులో తీరం దాటుతుందని మొదట్లో వాతావరణ శాఖ అధికా రులు అంచనా వేశారు. కానీ.. తీరం దాటకుండా ఏపీ వైపుగా బయలు దేరింది. కానీ.. వాతావర ణంలో వచ్చిన అనూహ్య మార్పులతో దిత్వాహ్ తుపాన్ యూటర్న్ తీసుకోబోతోంది
Comments
Post a Comment