నేటి నుండి తెలంగాణలో ప్రజా పాలన ఉత్సవాలు!
వార్త నేత్రం :న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్:డిసెంబర్ 01
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 9 నాటికి రెండేళ్లు పూర్తి కావస్తున్న సందర్భం గా ప్రజాపాలన ఉత్సవాలు నిర్వహిస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు.
ఆదివారం సాయంత్రం సచివాలయంలో సీఎం, మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి,మాట్లాడుతూ.. అద్భుత పాలసీని జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పారు. బలమైన ఆర్థిక రాష్ట్రంగా నిలదొక్కుకునేం దుకు విజన్ డాక్యుమెంట్ తయారు చేసినట్టు పేర్కొన్నారు.
డిసెంబరు 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆదాయం పెంచుతా మని..పేదలకు పంచుతా మని వివరించారు. తెలంగా ణకు రెండో మణిహారం రెడీ చేసుకుంటున్నామని.. రాష్ట్రానికి నాలుగు కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నాయని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ల గురించి వివరించారు. విజన్ డాక్యుమెంట్‌లో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రజలకు మరింత చేరువ య్యే పాలన, పారదర్శకత, వేగవంతమైన అభివృద్ధి.. ఇవే మా ప్రభుత్వ లక్ష్యాలని చెప్పారు. ప్రజా పాలన ఉత్సవాల ద్వారా గత రెండేళ్లలో చేసిన పనులను ప్రజల ముందుంచుతూనే, 2047 నాటికి తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దే విజన్‌ను పంచుకుంటామని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రజలందరూ ఈ ఉత్సవా ల్లో భాగం కావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తోందని తెలిపారు.
*ప్రజా పాలన ఉత్సవాల ప్రధాన షెడ్యూల్ వివరాలు!*
డిసెంబర్ 1న మక్తల్‌లో ఉత్సవాలు ప్రారంభం మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు...
డిసెంబర్ 1 నుంచి 9 వరకు: ప్రతిరోజూ ఒక ఉమ్మడి జిల్లాలో కార్యక్రమం. సీఎం రేవంత్ రెడ్డితో పాటు సంబంధిత ఉమ్మడి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.
డిసెంబర్ 6 హైదరాబాద్ లోని యూనివర్సిటీలో ఉత్సవాలు – సీఎం రేవంత్ రెడ్డి హాజరు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
డిసెంబర్ 8 & 9: ఫ్యూచర్ సిటీలో భారీ కార్యక్రమాలు
8వ తేదీ: గడిచిన రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరణ. తదితర అంశాలు ఉంటాయని పేర్కొన్నారు.
Comments
Post a Comment