తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్,ఈవెంట్ కు అంత సిద్ధం!


వార్త నేత్రం : న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్:డిసెంబర్ 07

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ నున్న గ్లోబల్ సమ్మిట్ కు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లోని ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాటు చేస్తుంది, 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నాలుగు చోట్ల పార్కింగ్ స్లాట్లను కూడా కలుపుకుంటే మొత్తం 500 ఎకరాల భూమిని సమ్మిట్ కోసం వినియోగిస్తున్నట్లు తెలు  స్తుంది.. రేపు మధ్యా హ్నం వరకల్లా ఏర్పాట్లన్నీ పూర్త వుతాయని అధికా రులు చెబుతున్నారు. 

దానికంటే ముందుగా ఈరోజు ఆదివారం ఏర్పాట్ల ను పరిశీలించడానికి డ్రై రన్ ను నిర్వహించనున్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8,9, తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 కు దేశ విదేశాలకు చెందిన దిగ్గ జాలు తరలిరానున్నారు తెలంగాణ రైజింగ్ థిమ్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పరిశ్రమల అధినేతలు ఇన్నో నెటర్లు, పాలసీ మేకర్లు,సినీ, క్రీడా, విద్య, రంగాలకు చెందిన ప్రము ఖులు విదేశీ రాయబారులు వివిధ రంగాలకు చెందిన నీస్టాతులను ఒకే వేదిక పైకి తీసుకొస్తుంది, 

సదస్సులో పాల్గొనవల సిందిగా..రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,800 మందికి ఆహ్వానాలు పంపగా ఇప్పటికే సుమారు 600 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ, ప్రముఖులు తమ సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 

రాష్ట్ర భవిష్యత్‌ను ఆవిష్కరించే దిశగా జరిగే ఈ గ్లోబల్ సమ్మిట్లో రెండు రోజులపాటు మొత్తం 27 ప్ర త్యేక ప్యానల్ చర్చలు జ రుగుతాయి. ప్యానల్ చర్చల్లో భాగంగా ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, ఐటీ- సెమీకండక్ట ర్లు, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవసాయం, పరిశ్రమ లు, మ హిళా వ్యాపారవేత్తల ప్రోత్సా హాం, గిగ్ ఎకానమీ, సామాజిక సంక్షే మం, స్టార్టఫ్‌లు వంటి విభిన్న రంగాలపై చర్చలు ఉంటాయి 

వరల్డ్ హెల్త్ ఆర్డనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ప్రతినిధుల తో పాటు తేరి, బిసిజి, మైక్రాన్ ఇండి యా, హిటాచ్చీ ఎనర్జీ, ఓ2 పవర్, గ్రీన్ కో, అపో లో హాస్పిటల్స్, ఐఐటి హైదరాబాద్, నాస్‌కాం, సాప్రాన్, డిఆర్‌డిఓ, స్కై రూట్, ధృవ స్పేస్, అ మూల్, లావురస్ ల్యాబ్స్, జిఎంఆర్, టాటా రియాల్టీ, కోటాక్ బ్యాంక్, గోల్డ్‌మ్యాన్ సాచ్స్, బ్లాక్‌స్టోన్, డిలైట్, క్యాపిటల్ ల్యాండ్, స్విగ్గీ, ఏడబ్లూఎస్, రెడ్. హె ల్త్, పివిఆర్ ఇనోక్స్, సిక్యా ఎంటర్‌టైన్‌మెంట్, తాజ్ హోటల్స్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్