దేశవ్యాప్తంగా 25 వేల 487 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్!


వార్త నేత్రం : ప్రతినిధి

  
హైదరాబాద్:డిసెంబర్ 10
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి కేంద్ర సాయుధ పోలీస్ బలగాలలో బిఎస్ఎఫ్, సిఆర్ పి ఎఫ్, ఐటిబిపి, సీఐఎస్ఎఫ్, ఏ ఆర్, ఎస్ఎస్ఎఫ్,ఎస్ ఎస్ బి, మొత్తం 25,487, కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్‌ ను విడుదల చేసింది. 

అభ్యర్థులు తమ దరఖాస్తు లను 2025 డిసెంబర్ 31లోపు సమర్పించాలి. ఆసక్తి, అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలలో పురుషులకు 23,467 పోస్టులు కేటాయించగా.. మహిళలకు 2,020 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. 

ఈ నియామకాల ద్వారా వివిధ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFలు), అస్సాం రైఫిల్స్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ SSFలలో ఖాళీలను భర్తీ చేయనున్నారు.ఖాళీల వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు....

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (మెట్రిక్యులేషన్) ఉత్తీర్ణులై ఉండాలి. 

*అభ్యర్థుల వయస్సు* 

జనవరి 1-01-2026 నాటికి 18 నుండి 23 సంవత్సరాలు ఉండాలి!

*వయసు సడలింపు!* 

ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు లో సడలింపు ఉంటుంది,ఓ బి సి, కి మూడు సంవత్సరాలు ఎస్సీ,ఎస్టీ,కి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది! 

*జీతం*

ఎంపికైన అభ్యర్థులకు నెలకు దాదాపురూ " 21,700 నుండి రూ" 69,100 వరకు జీతం, ఉంటుంది.. అలాగే ఇతర అలవెన్సులు లభిస్తాయి.

Comments

Popular posts from this blog

బిజెపిలో చేరిన మసాలా గ్రామస్తులు ...

తియ్యని విషం ..!

ప్రభుత్వ నిధుల ఖర్చు వివరాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి..సామాజిక నేత అందె రఘు సుప్రీంకోర్టులో పిల్