ప్రపంచమంతా నిద్రపోయినా మేల్కొని వుండే ఒకే ఒక్కడు పోలీస్* (పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా)
టైమ్ తో పన్లేదు ఏరియాతో పన్లేదు. డేంజర్ అని తెలిస్తే.. అక్కడ అడ్డుగా నుంచునేది పోలీస్. రక్షణ అంటే గుర్తొచ్చేది పోలీస్. బోర్డర్ నుంచి.. ఊళ్లకు వెళ్లే రోడ్ల వరకు అన్ని చోట్లా అండగా ఉండేది పోలీస్. అలా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులను స్మరించుకునేందుకు.అన్ని ఏర్పాట్లు జరుగుతున్నయ్. అక్టోబర్ 21 కోసం అరేంజ్ మెంట్స్ చేస్తున్నారు అధికారులు. చేతిలో లాఠీ. పాకెట్ లో గన్ను. వంటి మీద ఖాకీ డ్రస్సు.ఇంకేం అవసరం లేదు. స్కెడ్యూల్ తో పన్లేదు. టైం టేబుల్ అవసరం లేదు. ట్వంటీ ఫోర్ హవర్స్ ఆన్ డ్యూటీ. వంద నెంబర్ మోగొచ్చు. మోక్కపోవచ్చు. ఇన్ ఫర్మేషన్ వచ్చిందంటే చాలు.. ప్రమాదం ఉన్న ప్రతి చోటా ముందుగా ఉండేది పోలీసే. ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారు.ఎండ,వాన,పగలు,రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ - పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసుకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపించడం మనందరి బాధ్యత...పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి ...